పల్లెపండుగలో మంజూరైన పనులను సక్రమంగా ప్రజా ప్రతినిధులు చేసుకోవాలని బొబ్బిలి ఎంపిడిఓ పి. రవికుమార్ కోరారు. ఈ మేరకు కింతలవానిపేట గ్రామంలో రూ.30లక్షలతో వేసిన సిసి రోడ్డును మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పనులను సంక్రాంతిలోగా పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పనుల్లోనూ నాణ్యత లోపించకుండా ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులను పర్యవేక్షించాలని సూచించారు.