రామభద్రపురం మండల పాతరేగ గ్రామనికి చెందిన సుమారు వంద కుటుంబాలు మాజీ ఎంపీటీసీ పెద్దింటి పైడిపునాయుడు, అవుగడ్డి బలరాంనాయుడు, మాజీ సర్పంచ్ గొర్లె శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో వైకాపాను వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు శనివారం బొబ్బిలి ఎమ్మెల్యే కేంపు కార్యాలయం రాజదర్బార్ ప్రాంగణంలో ఎమ్మెల్యే బేబినాయన వారందరికీ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.