పార్వతీపురం: ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు భేష్: కమిషనర్ వి. కరుణ
మన్యం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు భేషుగ్గా ఉందని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి. కరుణ తెలిపారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో మంగళవారం పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రితో పాటు జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఆసుపత్రిలో ఎంసీహెచ్, ట్రైబల్ సెల్ నందు రోగుల వివరాలను తెలుసుకున్నారు.