ప్రధానమంత్రి జన్ మన్ పధకం తుది నివేదిక అందించాలి
ప్రధాన మంత్రి జన్ మన్ కార్యక్రమం కింద గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడం కొరకు పంపిన ప్రతిపాదనలపై విచారణ జరిపి తుది నివేదిక అందించాలని మన్యం జిల్లా కలెక్టరు ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో ప్రధానమంత్రి జన్ మన్ పధకం ప్రతిపాదనలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఇప్పుడు అందించే నివేదిక ఆధారం గానే పధకాలు మంజూరు అవుతాయని తెలిపారు.