గజపతినగరం: ఎన్పిసిఐ లింకేజ్ డ్రైవ్ ఉమ్మడి ప్రణాళిక
గజపతినగరం ఎంపీడీవో ఆఫీస్ పరిధిలో బుధవారం ఎంపీడీవో కళ్యాణి అధ్యక్షతన 22 గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ల సమావేశంలో గజపతినగరం సబ్ డివిజన్ పోస్టల్ ఇన్ స్పెక్టర్ ఉపేంద్ర పాల్గొని ఎన్పిసిఐ లింకేజ్ డ్రైవ్ ఏ విధంగా చేయాలో దిశానిర్దేశం చేశారు. రెండు శాఖల ఉమ్మడి కార్యాచరణతో మాత్రమే వంద శాతం పూర్తి చేయగలమని చెప్పారు.