వెంకటగిరి: నవ దంపతులు అదృశ్యం
నవ దంపతులు అదృశ్యమైన ఘటన వెంకటగిరి రూరల్ మండలం సిసి కండ్రిగలో శుక్రవారం చోటుచేసుకుంది. దీపావళి పండుగకు భర్తతో కలిసి అత్తవారింటికి బయలుదేరిన వెల్లూరు రాజ, పెంచలమ్మ దంపతులు అదృశ్యమయ్యారు. రాపూరు బస్టాండ్ సమీపంలో సిసి ఫుటేజ్ లో దంపతులతో పాటు అనుమానంగా మరో వ్యక్తి కనిపించినట్లు బంధువులు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అన్నమయ్య జిల్లా రాజంపేటలో గాలింపు చర్యలు చేపట్టారు.