హై స్కూల్ విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కార్యక్రమం
వెంకటగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు సమగ్ర శిక్ష, టైమ్స్ సెంటర్ ఫర్ లర్నింగ్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో.. ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్య ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయురాలు వాణెమ్మ, వృత్తి విద్య ఉపాధ్యాయులు హరీష్ పాల్గొన్నారు. శిక్షణ ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఈ రంగాలలో కెరియర్ ఎంచుకోవాలని ఆలోచిస్తే దానికి అవసరమైన ప్రాథమిక నైపుణ్యాలను పొందుతారు అని తెలిపారు.