తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. మున్సిపాలిటీలో పారిశుధ్య, ఇంజనీరింగ్, పర్మినెంట్, రోజువారీ కార్మికులుగా పనిచేస్తూ దీర్ఘకాలికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వడ్డీపల్లి చెంగయ్య డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఆర్. శ్రీధర్ కు పలు సమస్యలతో కూడిన సమ్మె నోటీసు ఇచ్చారు.