ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో శనివారం పెన్షన్ పంపిణీ చేశారు. సచివారం సిబ్బంది టిడిపి నాయకులతో కలిసి ఆయన జోరు వర్షంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఆగస్టు 31 న ప్రభుత్వం పెన్షన్ అందజేయాలని నిర్ణయించిందన్నారు. గ్రామస్తులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు.