కేవీబీ పురం మండలంలో రోడ్డు సమస్యతో విద్యార్థులకు ఇబ్బందులు
సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీ పురం మండలం ఎం.ఎ రాజుల కండ్రిగ గ్రామం నుంచి పోలినాయుడు కండ్రిగ, పూడి చెన్నకేశవపురం వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో తెగడానికి సిద్ధంగా ఉంది. ఈ రహదారిపై గాజువే మీదుగా పరీక్షలకు వెళుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.