పిచ్చాటూరు: నేడు అరణియార్ డ్యాం నుంచి నీటి విడుదల
పిచ్చాటూరు అరణీయార్ నీటిమట్టం గురువారం ఉదయం 7. 45 గంటలకు 30. 5 అడుగులు చేరుకుంది. ప్రాజెక్టుకులోకి వచ్చే నీటి ఇన్‌ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 31 అడుగులు. ప్రజాక్ట్ లోకి పూర్తి స్థాయిలో నీరు చేరడంతో ఇవాళ 11 గంటలకు గేట్లు ఎత్తనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అరుణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ లోకేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.