పీలేరు పంచాయతీ ఈవోగా వై. గురుమోహన్ భాద్యతలు
పీలేరు మేజర్ పంచాయతీ రెగ్యులర్ ఈవోగా వై. గురుమోహన్ నియమితులయ్యారు. మంగళవారం పీలేరు పంచాయతీ కార్యాలయంలో ఆయన భాద్యతలు చేపట్టారు. కలికిరి పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తూ బదిలీ పై ఆయన ఇక్కడికి వచ్చారు. ఎంపీడీవో శివకుమార్ ను కలిసి తన నియామక పత్రాన్ని అందజేశారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.