గుర్రంకొండ: భూమి వివాదం కారణంగా రైతు పై ప్రత్యర్ధులు దాడి
భూమి వివాదం కారణంగా రైతుపై ప్రత్యర్థులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుర్రంకొండ మండలం టి. పసలవాళ్ళ పల్లెకు చెందిన వెంకటేష్ (46)కు సిద్దయ్యకు ఆస్తి గొడవలు ఉన్నాయి. పాత కక్షలతో దారి కాచి వెంకటేష్ పొలం నుండి వస్తుండగా సిద్దయ్య, సురేంద్ర, రామానుజులు, మల్లయ్య, ధనమ్మ దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.