కలికిరి వద్ద బైక్ మీద నుండి కింద పడి యువకుడు
శాకం వారి పల్లికి చెందిన రేవంత్ మంగళవారం తన సొంత పనుల నిమిత్తం మోటారు బైకులో కలికిరికి వెళ్ళాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా శాకం వారి పల్లి, వాల్మీకిపురం రోడ్డు ములుపులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూసి పక్కకు తప్పుకోవడం వలన మోటారు బైకు అదుపుతప్పి కింద పడింది. రేవంత్ కు గాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.