కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను నడపడం జరుగుతుందని ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. కుప్పం డిపో పరిధిలో శుక్రవారం ప్రజా రవాణా సదస్సు నిర్వహించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండును రాష్ట్రానికే మోడల్ బస్ స్టేషన్ గా మార్చడం జరుగుతుందన్నారు. పాత బస్సులను పైలెట్ ప్రాజెక్టు కింద ఈ బస్సులుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.