రాఖీ పండుగ రోజున అక్క చెల్లెలు అన్నదమ్ములకు హెల్మెట్‌ను బహుమతిగా ఇవ్వాలని ట్రాఫిక్ సీఐ నిత్య బాబు విజ్ఞప్తి చేశారు.శనివారం మధ్యాహ్నం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అన్నదమ్ముల బాగోగులు కోరుకుంటూ రాఖీ కట్టడం మన సాంప్రదాయం అన్నారు. అదే రోజు వారి భద్రతను కోరుకుంటూ వినూత్నంగా హెల్మెట్‌ను బహుమతిగా ఇవ్వాలని కోరారు.హెల్మెట్ ఉన్నవారిని వాహనం నడిపేటప్పుడు ధరించే విధంగా ప్రోత్సహించాలన్నారు.