తిరువణంపల్లి లోని హరిజనవాడ లో జరుగుచున్న ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిని ప్రభావతి దేవి, జిల్లా మలేరియా అధికారి అనిల్ కుమార్ శుక్రవారం పర్యవేక్షించారు. సిబ్బందికి సూచనలు జారీ చేశారు. స్థానిక జడ్పీటీసీ తో కలిసి గృహ సంద ర్శనలు చేశారు. ఆరోగ్య పరిస్తుతులపై వాకబు చేశారు. ఇంటిలోపల బయటశుభ్రతలు పాటించాలని సూచించారు. కాణిపాకం పిహెచ్సి ని, ఎఫ్ డి పి ని సందర్శించి మాత శిశు ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, గర్భిణీలు కాన్పు అయ్యేంతవరకు తీసుకోవాల్సిన సూచనలు, తల్లిపాల ఆవశ్యకత, వ్యాధి నిరోధక ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తప్పక సమయ పాలన పాటించాలన్నారు.