వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి గురువారం రాత్రి టెక్కలిలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం ఆవరణలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు పూజల్లో పాల్గొన్న అనంతరం బాణసంచా వెలిగించి సందడి చేశారు. కాగా ఇరువురు కలిసి దీపావళికి క్రాకర్స్ కాల్చిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.