మెలియాపుట్టి మండలం సవరకుడ్డబ గ్రామంలో ఆదివారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. టెక్కలి ఎక్సైజ్ సీఐ మీరా సాహెబ్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించగా 500 లీటర్ల బెల్లం ఊటతో పాటు 20 లీటర్ల నాటుసారా స్వాదీనం చేసుకుని ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. వీరితో పాటు ఎక్సైజ్ ఎస్ఐలు పీ. సత్య నారాయణమూర్తి, కల్యాణి, సిబ్బంది ఉన్నారు.