నవంబర్ 9నుండి పలాసలో జరుగు సిపిఎం జిల్లా 18వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కే. మోహన్ రావు మంగళవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు కంచిలి లో జరిగిన సిపిఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర తీర ప్రాంతాల లో కారిడార్లు పేరుతో రైతుల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు