నౌపడ రైల్వే స్టేషన్ లో పలాస రైల్వే చైల్డ్ హెల్ప్ డెస్క్ సూపర్వైజర్ బాల సరస్వతి ఆధ్వర్యంలో బుధవారం బాలల రక్షణ కొరకై 1098 కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 0 నుంచి 18 ఏళ్లలోపు బాల బాలికలు ఆపదలో ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1098కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మికులు, అక్రమ రవాణా మొదలగు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.