రంగురంగుల వినాయక ప్రతిమలు హానికరం అని మందస జిల్లా పరిషత్ హైస్కూల్ 9వ తరగతి సంస్కృత విద్యార్డులు మట్టితో వినాయక ప్రతిమలు తయారు చేసి వాటినే పూజస్థామని తెలియజేసారు. తమ లాగానే ప్రజలు అందరూ మట్టి ప్రతిమలనే పూజించాలని కోరారు. ప్రజలలో పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తి పెంచాలని కోరారు. ప్రతి వ్యక్తి పర్యావరణానికి జరిగే ప్రతి హాని వలన తమకే నష్టమని తెలుసుకోవాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే వినాయక ప్రతిమలు మన జల వనరులను నాశనం చేస్తాయని తద్వారా మనకు తీవ్ర హాని కలుగుతుందని తెలియజేసారు. అలానే రంగురంగుల వినాయక ప్రతిమలు లో లేడ్ ఉంటుందని అది సైతం జలవనరుల్లో కలిసి మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూలు సంస్కృత ఉపాధ్యాయురాలు గైర్వాని తో పాటు కంచరాన చంద్రహాసిని, లాస్య, యామిని, స్వాతి, జయశ్రీ, అవినాష్, సాయివర్ధన్, చైత్ర, మనీషా, దిక్షిత తదితరులు పాల్గొన్నారు.