వేడెక్కిన రాజకీయం.. జోరుగా ప్రచారం..

1941பார்த்தது
వేడెక్కిన రాజకీయం.. జోరుగా ప్రచారం..
పలాస నియోజకవర్గం లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పోలింగ్ సమయం దగ్గరౌతున్న కొద్దీ రసవత్తరంగా మారింది. ప్రముఖ రాజకీయ పార్టీలు సరియైన అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటించడంతో వారందరూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష ఆదేశాల మేరకు నేడు మందస మండల కేంద్రంలో తెలుగుదేశం మద్దతు అభ్యర్ది వేపాడ చిరంజీవిరావు ని గెలిపించమంటూ బాబ్స్ మాస్టారు ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరు వార్డుల వారీగా పర్యటించి ఉపాధ్యాయుల, గ్రాడ్యుయేట్ ల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. మండలాల వారీగా గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితాలో సరిచూసి తమ అభ్యర్ధికి ఓటు వేయాలని కోరారు. ఒకవైపు ఓటర్లను ఆకర్షిస్తూనే. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలియజేశారు. అదే విధంగా మండలాల వారీగా ఉన్న ముఖ్య నేతలతో సమావేశమై మద్దతు ప్రకటించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రట్టి లింగరాజు, రాజాన మహేష్ మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி