'గోడౌన్ లు ఊరికి బయటే ఉండాలి'

896பார்த்தது
'గోడౌన్ లు ఊరికి బయటే ఉండాలి'
గోడౌన్లు, శ్మశానాలు కబేళాల, ఫ్యాక్టరీలు మొదలైనవి కట్టి మొదలుపెట్టినప్పుడు ఊరికి బయటే ఉంటాయి. కానీ కాలక్రమంలో పెరిగే జనాభాతో పాటుగా ఊరు విస్తరించి ఇలాంటివి ఊరి మధ్యలోకి వస్తున్నాయి. కానీ మందసా వంటి కొన్ని గ్రామాల్లో ఇళ్లలోనే గొడౌన్లు పెట్టి, రహదారులకు అడ్డంగా బారీ వాహనాలు కొన్ని గంటల తరబడి నిలుపుతూ ఎందరో వ్యాపారస్తులకు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు.

మంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటీవల చేపట్టిన రోడ్ల విస్తరణ వల్ల తమ వ్యాపారాలు మెరుగుపడతాయనే ఆశ కూడా ఇటువంటి చర్యల వలన నిర్వీర్యం అయిపోతుందని ఇక్కడి ప్రజలు వాపోతన్నారు. ఇన్ని రోజులుగా మందస పట్టణ మెయిన్ రోడ్ లో గోడౌన్ లు నిర్వహించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నా గోడౌన్ నిర్వాహకులపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుందని స్థానిక ప్రజలు తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఎవరికీ ఇబ్బంది లేని, ట్రాఫిక్ సమస్యలు లేని ప్రదేశాలలో గోడౌన్ లకు పర్మిషన్లు ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி