ఇచ్చాపురం: నవంబర్ 1న సీఎం చంద్రబాబు రాక
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నవంబర్ ఒకటో తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె. వి మహేశ్వర రెడ్డి నియోజకవర్గంలోని సోంపేట, ఇచ్చాపురం, కొర్లాం, ఈదుపురం గ్రామాలను సందర్శించారు. దీపావళి సందర్భంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేసే కార్యక్రమాన్ని ఆయన జిల్లా నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.