సోంపేట రైల్వేస్టేషన్ లో రెండో పూట రిజర్వేషన్ కౌంటర్ ను కొనసాగించాలని కుర్దాలో డీసీఎంకు జెడ్ఆర్యూసీసీ మెంబర్ శ్రీనివాస్ రంగా వినతిపత్రం అందజేశారు. పలు గ్రామీణ ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న సోంపేట రైల్వేస్టేషన్ లో రిజర్వేషన్ కౌంటర్ కొనసాగించాలని కోరారు. అలాగే పలాస - భువనేశ్వర్ మెమో, బ్రహ్మపూర్ - విశాఖపట్నం ప్యాసింజర్ రైళ్లను బారువ, జాడుపూడి ఆర్ఎస్ రైల్వేస్టేషన్లో నిలుపుదల చేయాలని కోరారు.