ఎచ్చెర్ల నియోజకవర్గం జి సిగడాం మండలం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తెలిపారు. ఆదివారం జి. సిగడాం మండలం సంత ఉరిటి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు నిలువు లేకుండా రోడ్డున పడ్డారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే గ్రామానికి చేరుకుని వారికి భరోసా కల్పించారు. ఈ క్రమంలో రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో పలు నిత్యావసర సరకులను వారికి అందజేశారు.