ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి 12, 13 వార్డుల్లో గల అంగన్వాడి కేంద్రాలలో సూపర్వైజర్ కే. లీలారాణి శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడి కేంద్రంలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని ఇటీవలే వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈనెల 5వ తేదీ నాగులచవితి రోజు పూజా కార్యక్రమాల కారణంగా ఆరోజు అంగన్వాడికి చిన్నారులు తక్కువ మంది వచ్చారని అంగన్వాడీ టీచర్లు వివరణ ఇచ్చారు.