శ్రీకాకుళం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 34 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుమారు ఎనిమిది నెలలు గడిచినా ఇప్పటివరకు వేతనాలు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు మేరకు పని చేయించుకున్న వంద రోజుల్లో వేతనాలు చెల్లించాలి. దీంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేబర్ కమిషన్ కార్యాలయంలో ఈనెల 4న ఫిర్యాదు చేశారు. తక్షణమే వెంటనే యూనివర్సిటీ అధికారులు న్యాయం చేయాలని వారు కోరారు.