శ్రీకాకుళం జిల్లాలో దంచి కొట్టిన వర్షం
ఎల్. ఎన్. పేట మండలంలో మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుండపోతగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మబ్బులు కమ్ముకున్నాయి. చిన్న పాటి వర్షం ప్రారంభమై కుండపోతగా వర్షం కురవడం ప్రారంభమైంది. ఈ క్రమంలో పాదచారులు, వాహనదారులు ఒక్కసారిగా పరుగులు తీశారు. అయితే ఈ వర్షం రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటకు ఆఖరితడిగా వర్షం ఉపయోగపడుతుందని చెబుతున్నారు.