పలాసకాశీబుగ్గ మున్సిపాలిటీ 23వ వార్డ్ అన్నపూర్ణ ఆశ్రమం వీధి రాజకీయ కారణాలతో నిర్లక్ష్యానికి గురైంది. ఈ వార్డు టీడీపీ కౌన్సిలర్ పూర్తిగా పట్టించు కోకపోవడంతో రోడ్లు, మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. మురికి నీరు మంచినీటి బావుల్లోకి బోరుల్లోకి చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చేసేదిలేక శుక్రవారం ఆవార్డు ప్రజలే స్వచ్ఛందంగా మురుగు కాలువల్లో ఉన్న మురికి నీటిని తీసి వేశారు.