పలాసలోని భాగ్యలక్ష్మి పేపర్ ప్రోడక్ట్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచార ఇవ్వడంతో హుటా హుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సుమారు రూ. 30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.