పర్యావరణానికి విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. గత వైసీపీ పాలకులు కొండలను గుల్ల చేసేసి పచ్చదనం లేకుండా చేశారని దుయ్యబట్టారు. కొండలను గుల్ల చేసి, అక్రమంగా కంకర తరలిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని తహసీల్దార్లను ఆదేశించారు. అక్రమాలకు వినియోగించిన వాహనాలను సీజ్ చెయ్యాలని ఆదేశించారు.