లావేరు మండలంలోని తామాడ గ్రామంలోని నవదుర్గా పీఠంలో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పీఠం నిర్వాహకులు ఎల్ వి రమణ ఆధ్వర్యంలో గ్రామస్తులు పలువురు వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాసంతో కటోర దీక్షతో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు చేశారు. సోమవారం నాటికి నవరాత్రులు పూర్తి కావడంతో దాతల సహకారంతో గ్రామంలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు.