ఎచ్చెర్ల మండలం అరిణామ్ అక్కివలస గ్రామంలో శనివారం ఉదయం రూ. 3 లక్షల అంచనా వ్యయంతో మండల పరిషత్ నిధుల నుంచి సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఎచ్చెర్ల మండల పరిషత్ అధ్యక్షులు మొదలవలస చిరంజీవి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మండల పరిషత్ నిధులు మంజూరు చేసి గ్రామాల్లో పనులు ప్రారంభించామని, పనులను క్వాలిటీ & క్వాంటిటీతో పూర్తి చేయించాలన్నారు.