శ్రీకాకుళం సింగపురంలో పని చేస్తున్న డాక్టర్ బొడ్డేపల్లి మహతిని ప్రభుత్వం ఉత్తమ హెల్త్ ఆఫీసర్ గా ఎంపిక చేశారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లాఠకర్ చేతులు మీదుగా మహతి ఉత్తమ ఆఫీసర్ గా అవార్డును అందుకున్నారు. ఈమె స్వస్థలం లొద్దలపేట గ్రామం. ఈమెకు అవార్డు రావడం పట్ల గ్రామస్తులు, తోటి సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.