ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రంలో స్వదేశీ మత్స్యకార సహకార సంఘం సభ్యులకు వృత్తివిద్య శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి శుక్రవారం తెలిపారు. చేపల పెంపకంలో వాతావరణ కారకాలు, చేపల పెంపకంలో సాంకేతిక నూతన పద్ధతులను మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ చింతాడ బాలకృష్ణ వివరించారు. చేపలకు సంక్రమించే వివిధ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.