ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత గ్యాస్ పథకంలో భాగంగా దీపం 2 పథకాన్ని ధర్మవరంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. శుక్రవారం లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీస్ ఆవరణలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత,
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్, ఆర్డిఓ మహేష్ తో పాటు మహిళలకు దీపం 2 పథకంలో భాగంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు.