రాప్తాడు మండల కేంద్రంలోని మైనారిటీ కాలనీలో మంగళవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన ఈ 100 రోజుల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా రూ. 60 లక్షలతో మంజూరైన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అధికారులు, నాయకులతో కలసి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు.