పుట్టపర్తి: ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధీటుగా ఆప్కోలు: మంత్రి

56பார்த்தது
పుట్టపర్తి: ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధీటుగా ఆప్కోలు: మంత్రి
చేనేత వస్త్రాల వినియోగంపై ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా మరో 7 ఆప్కో షోరూమ్ లు ఏర్పాటు చేయనున్నామని, ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధీటుగా షోరూమ్ లను రూపొందిస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. పుట్టపర్తిలోని ఆప్కో షోరూమ్ ను మంత్రి సవిత శుక్రవారం ప్రారంభించారు. చేనేత రంగానికి మంచిరోజులు వచ్చాయని మంత్రి సవిత తెలిపారు. నేతన్నలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ఉన్నారన్నారు.

தொடர்புடைய செய்தி