ఇటీవల పెనుకొండ పట్టణంలోని ఎంజేపి స్కూల్ ను బిసి సంక్షేమ, ఈయుఎస్, చేనేత జౌళి శాఖా మంత్రి సవితమ్మ అకస్మిక పర్యటన సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూల్ నందు పలు సమస్యలను ప్రస్తావించారు. వాటిని పరిష్కరించమని సంబందిత అధికారులకు మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం పంచాయతీ రాజ్ అధికారులు, టిడిపి నాయకులు ఎంజేపి స్కూల్ నందు చేయబోయే మరమ్మతుల పనులను పరిశీలించారు.