మడకశిర పట్టణం వైబి హళ్లి లో శనివారం రోడ్డు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని టిడిపి పార్టీ ఇన్చార్జి గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. గత వైసిపి పాలనలో అభివృద్ధిని మరిచిపోయి, రోడ్లన్నీ గుంతల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడడం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్లు గుంతలు లేకుండా చేయాలని ఉద్దేశంతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగిందని తెలిపారు.