కళ్యాణదుర్గం పట్టణంలో ఆదివారం జరుగుతున్న అండర్ డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తన ఖర్చులతో ఆయన ప్లాంట్ నుంచి కాంక్రీట్ తెప్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్నటి రాత్రికే పాత బస్టాండ్ వద్ద తీసిన గుంతలో బెడ్డింగ్ పనులు దాదాపు పూర్తి కావడంతో ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని, పనులు నాణ్యతగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.