హిందూపురం: రైల్వే స్టేషన్ రోడ్డును పరిశీలించిన ఎంపీ
పెనుకొండ పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్డును సోమవారం హిందూపురం పార్లమెంటు సభ్యులు బి కే పార్థసారథి పరిశీలించారు. రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు ఏర్పాటుకు సంబంధించి, సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెనుకొండ పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు లేక చాలా అధ్వానంగా ఉందన్నారు. కావున పెనుగొండలో ఎలాంటి సమస్య ఉన్న తీరుస్తామని హామీ ఇచ్చారు.