గుత్తి ఫుట్ బాల్ క్రీడా మైదానం జలమయం అయింది. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి క్రీడా మైదానం నీటిమడుగును తలపిస్తోంది. సోమవారం మైదానానికి వచ్చిన క్రీడాకారులు నిలిచిన వర్షపు నీటిని పక్కకు తరలించారు. మరోవైపు వర్షం వచ్చిన ప్రతిసారీ మైదానంలో వాకింగ్‌కు ఇబ్బంది కలుగుతోందని వాకర్స్ తెలిపారు. అధికారులు స్పందించి వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని కోరారు.