గుత్తి తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా గురువారం పెరిగిన నిత్యవసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ. ప్రభుత్వం ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజల పైన భారాలు వేయడానికి ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసిల్దార్ ఓబులేసు కు అందజేశారు.