తుంగభద్ర డ్యాంకు స్థిరంగా ఇన్ ఫ్లో
అనంతపురం జిల్లా కు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోందని డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. గురువారం ఉదయానికి 28, 649 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 101. 45 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 29, 712 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.