తుంగభద్ర డ్యాంకు తగ్గిన ఇన్ ఫ్లో
అనంతపురం జిల్లాకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని డ్యామ్ బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయానికి 24, 627 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 101. 50 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 23, 804 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.