ఏపీలో భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు వర్షాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.