నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ నేతృత్వంలో గత రెండు రోజులుగా వివిధ అంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన పెంచుకునేందుకు శిక్షణ పొందుతున్న ఐ. ఏ. ఎస్ అధికారుల బృందాన్ని కమిషనర్ సూర్య తేజ బుధవారం రాత్రి అభినందించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న ఐ. ఏ. ఎస్ లు అందరికి జ్ఞాపిక అందజేసి శాలువాతో సత్కరించారు.